సీఐ మర్మాంగాలు కట్ చేసినా కానిస్టేబుల్ కారణం ఇదేనా..!!

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.
మహబూబ్‌నగర్ జిల్లాలో కత్తిపోట్ల కలకలం రేగింది. ఓ కానిస్టేబుల్ సీఐపై దాడికి పాల్పడ్డాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో సీఐ మర్మాంగాలు కట్ చేశాడు. ప్రస్తుతం సీఐ పరిస్థితి విషమంగా ఉండగా..ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మహబూబ్ నాగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తార్ అహ్మద్ పై హత్యాయత్నం. సీఐపై కత్తితో దాడి చేసి మర్మాంగాలను కోసిన కానిస్టేబుల్, సీఐకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తలలింపు.

కానిస్టేబుల్ భార్యతో సీఐ వివాహేతర సంబంధం కారణంగానే దాడి జరిగినట్లుగా అనుమానం…

కానిస్టేబుల్ జగదీష్ దాడికి పాల్పడ్డాడు….
తన భార్యతో సీఐ హమ్మద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో అతడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేశాడు. అయితే జగదీష్ భార్య కూడా కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పైస్థాయిలో ఉండి తన భార్యతో అక్రమం సంబంధం పెట్టుకోవటంతో జీర్ణించుకోలేక ఈ దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ దాడిలో సీఐ తీవ్రంగా గాయపడగా.. ముందుగా మహబూబ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి అనంతరం పరిస్ధితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు..సంఘటన స్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు వార్తలు వస్తుండగా.. ఈ ఘటన పోలీసు వర్గాలలో కలకలం రేపుతోంది. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.