కానిస్టేబుల్స్‌పై దాడి వనస్థలిపురం సీఐ రాజు సస్పెండ్..

హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌పై దాడి చేసిన సీఐ రాజును అధికారులు సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కమిషనరేట్‌లోని ఎస్‌బీ విభాగంలో సీఐగా రాజు పనిచేస్తున్నారు. ఆయనకు ఓ మహిళతో అక్రమ సంబంధం ఉంది. వనస్థలిపురంలో మహిళతో కారులో ఏకాంతంగా గడుపుతున్న విషయం తెలుసుకున్న భార్య.. అక్కడికి వెళ్లి భర్తతో గొడవ పెట్టుకుంది. గొడవను చూసిన వనస్థలిపురం కానిస్టేబుళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే మద్యం సేవించి ఉన్న సీఐ రాజు మత్తులో తాను సీఐ అంటూ ఇద్దరు కానిస్టేబుల్స్‌పై దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్రమ సంబంధ పెట్టుకున్న మహిళతో పాటు ఇన్‌స్పెక్టర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తమపై దాడి చేసినందుకు కానిస్టేబుల్స్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన పోలీసులు సీఐ రాజుపై సస్పెన్షన్ వేటు వేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు..