సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను: సునీత.

Suneetha Narreddy:

పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ తన పని తాను చేసుకుంటూ వెళ్తోందని ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత అన్నారు. వివేకా జయంతి సందర్భంగా కడప జిల్లా పులివెందులలో ఆయన సమాధి వద్ద సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, కుటుంబసభ్యులు నివాళులర్పించారు.

అనంతరం సునీత మీడియాతో మాట్లాడారు.

సీబీఐ దర్యాప్తుపై ఎలాంటి కామెంట్‌ చేయనని సునీత చెప్పారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో తన గురించి కొందరు మాట్లాడుకునే విషయాలను తండ్రి దృష్టికి తీసుకెళ్లానని ఆమె గుర్తుచేసుకున్నారు. పొగడ్తలను పట్టించుకోవద్దని.. తప్పును వేలెత్తి చూపించే అంశాలపై దృష్టిపెట్టాలని అప్పట్లో ఆయన సూచించారని సునీత వివరించారు..