బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి…

*🔹బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు.

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ను ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. జనవరి 4న ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన జగన్‌ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పార్టీ తరఫున స్వాగతం పలికారు..

నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న సీఎం జగన్ కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదర స్వాగతం పలికారు…
ఈ సందర్భంగా మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీ, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులున్నారు.

నివాసంలో కోలుకుంటున్న కేసీఆర్ వద్దకు చేరుకున్న జగన్ వారికి పుష్పగుచ్ఛాన్ని అందించి పరామర్శించారు. …ఎలా ఉన్నారు సార్‌.. ఆరోగ్యం ఎలా ఉంది’ అని అడిగి తెలుసుకున్నారు.

కాగా గత నెలలో కేసీఆర్‌ తన ఫామ్‌ హౌస్‌ లో జారిపడటంతో ఆయన తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్‌ కు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. హిప్‌ రీప్లేస్‌ మెంట్‌ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. కొద్దిరోజులు వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రిలోనే కేసీఆర్‌ చికిత్స తీసుకున్నారు. డిసెంబర్‌ 15న బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని ఆయన పూర్వ నివాసానికి వెళ్లారు. అక్కడే కొద్దిరోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు..

సీఎం జగన్ వెంట ఎంపీ మితున్ రెడ్డి, ఎమ్మెల్సీ రఘురాం, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులున్నారు…

కేసీఆర్‌ ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పలు పార్టీల నేతలు, మెగాస్టార్‌ చిరంజీవి తదితరులు పరామర్శించారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌ పరామర్శించారు. ఆయనతోపాటు వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం తదితరులు ఉన్నారు.

కాగా తెలంగాణ భవన్‌ లో బుధవారం లోక్‌ సభ ఎన్నికల కోసం బీఆర్‌ఎస్‌ నియోజకవర్గాల సమీక్ష ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమీక్షలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. కేసీఆర్‌ కోలుకుంటున్నారని, సంపూర్ణ ఆరోగ్యంతో ఈ నెలాఖరుకు ప్రజాక్షేత్రంలోకి వస్తారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తారని వెల్లడించారు. తెలంగాణ భవన్‌ నుంచి కూడా సమావేశాలు నిర్వహిస్తారని చెప్పారు…