కౌలు రైతులకు రైతు భరోసా.. నిధులు జమ చేయనున్న సీఎం జగన్‌..

*తాడేపల్లి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(గురువారం) కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నగదు జమ చేయనున్నారు.

వివరాల ప్రకారం.. సీఎం జగన్‌ ఏపీలోని కౌలు రైతులకు రైతు భరోసా అందించనున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదును సీఎం జగన్‌ జమ చేయనున్నారు. కౌలు రైతులతో పాటుగా దేవాదాయ భూమి సాగుదారులకు కూడా సాయం అందనుంది. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు..