ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటన..

ఏపీ సీఎం జగన్ కేబినెట్ మీటింగ్ అనంతరం ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు.

రేపుకూడా సీఎం ఢిల్లీలో పర్యటించనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు.

ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, ప్యాకేజీ, కేంద్రం నుంచి రావాల్సిన రాయితీలను ఆయన కోరనున్నారు…