సీఎం జగన్‌ కు ఊహించని షాక్ తగిలింది. ఏపీలోని మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దులపై హై కోర్టు సంచలన తీర్పు…

మూడు రాజధానులపైహైకోర్టు సంచన తీర్పు..
సీఎం జగన్‌ కు ఊహించని షాక్ తగిలింది. ఏపీలోని మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దులపై హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని..ఉన్నది ఉన్నట్లుగా అభివృద్ధి చేయాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని.. 6 నెలల్లో ఒప్పంద ప్రకారమే అభివృద్ధి చేయాలని పేర్కొంది.3 నెలల్లో రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని.. రైతులకు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని తెలిపింది. అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని.. రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్ల ఖర్చు కోసం రూ.50 వేలు ఇవ్వాలని.. కొంతమంది న్యాయమూర్తులు ఈ కేసులు విచారించొద్దన్న పిటిషన్‌ను కొట్టివేసింది ఏపీ హై కోర్టు. రాజధానిపై నిర్ణయాలు, చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని తేల్చి చెప్పింది హై కోర్టు.