ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్‌లో ప్రకటించిన ‘బడుల బాగు’ పథకం..సీఎం కేసీఆర్‌

R9TELUGUNEWS.com: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్‌లో ప్రకటించిన ‘బడుల బాగు’ పథకం త్వరలో పట్టాలెక్కనుంది. సీఎం కేసీఆర్‌ గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆర్‌.లింబాద్రి, ఇతర విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. బడుల రూపురేఖలు మార్చేందుకు ఏడాదికి రూ. 2,000 కోట్ల చొప్పున వరుసగా రెండేళ్లపాటు రూ. 4,000 కోట్ల నిధులను కేటాయిస్తామని, అందుకు ప్రత్యేక పథకాన్ని తెస్తామని గత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. దీనిని వీలైనంత త్వరగా ప్రారంభించాలని, దీనిపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు, విధివిధానాలను వచ్చే మంత్రిమండలి సమావేశంలో పెట్టి ఆమోదం తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం..