రేపు నల్లగొండ జిల్లాకు సీఎం కెసిఆర్…

రేపు నల్లగొండ జిల్లాకు సీఎం కెసిఆర్…
R9TELUGUNEWS.COM.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు.ఇటీవల ఎమ్మెల్యే కిశోర్‌కుమార్‌ తండ్రి మారయ్య మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మారయ్య చిత్రపటానికి నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు.