ఆరు నెలల ముందే తెరాస పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తాం…. సీఎం కేసీఆర్

ఆరు నెలల ముందే తెరాస పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తాం….

ఈసారి మేము ప్రయోగించే మంత్రానికి ప్రతిపక్ష పార్టీలు అవుట్….

రాసిపెట్టుకోండి 95 నుండి 105 సీట్లు మావే….

ముందస్తు ఎన్నికలు వస్తయని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఒకడు సోషల్‌ మీడియాలో పోస్టు పెడితే ముందస్తు ఎన్నికలు పెడ్తమా? 103 మంది ఎమ్మెల్యేలతో రాజకీయ సుస్థిరత ఉంది. వచ్చే ఎన్నికల్లో మేం 95 నుంచి 105 మధ్య సీట్లు సాధిస్తాం.మా దగ్గర ఉన్న మంత్రం ఏంటో తెలిస్తే ప్రతిపక్ష పార్టీలు కనీసం దానికి కౌంటర్ కూడా ఇవ్వలేవు….

పోయినసారి ముందస్తు వెళ్ళాం విజయఢంకా మోగించారు.. ఈసారి ఇంకా సమయం ఉంది దీనిపై అప్పుడే ఆ ఆలోచన చేయలేదు ఆలోచన చేసినప్పుడు అందరికీ చెప్తాం….. దానికోసం ప్రతిపక్ష పార్టీల ఆరాటం ఏమిటో మాకు అర్థం కావట్లేదు…