ఇవాళ రాజ్‌భవన్‌కు కేసీఆర్‌…!

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో ఉదయం 10.05 గంటలకు గవర్నరు తమిళిసై సౌందరరాజన్‌ ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు అనంతరం అయిదో ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరు కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సీఎంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు సైతం కార్యక్రమంలో పాల్గొననున్నట్లు సమాచారం.