యాదాద్రి శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామిని ద‌ర్శించుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్..

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు కూడా వీరితో పాటు ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం ఒక కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా అందించారు.
ఈ విరాళాన్ని హిమాన్షు అందజేశారు. స్వామి వారి దర్శనానంతరం ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. . స్వామి వారి దర్శనానికి ముందు యాదాద్రి కొండ దిగువన ఉన్న ప్రెసిడెన్సియల్ సూట్ లో వైటీడీఏ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సత్యనారాయణ వ్రత మండపం, గండి చెరువు ఆధునికీకరించే పనులు, గండి చెరులు పనులపై పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు…సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, జ‌గ‌దీశ్ రెడ్డి వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీ దీవ‌కొండ దామోద‌ర్ రావు, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత‌, పైళ్ల శేఖ‌ర్ రెడ్డి, చిరుమ‌ర్తి లింగ‌య్య‌, సుధీర్ రెడ్డి, జీవ‌న్ రెడ్డి, వైటీడీఏ చైర్మ‌న్ కిష‌న్ రావు, ఆల‌య ఈవో గీతా రెడ్డి ఉన్నారు.