రైతులు బ‌ల‌హీనులు కాదు.. దేశాన్ని న‌డుపుతున్న బ‌ల‌మైన శ‌క్తులు.. సీఎం కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగపూర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రాజకీయాల్లో మార్పులకు మహారాష్ట్ర నుంచే శ్రీకారం చుడతామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ గురించి చర్చించుకుంటున్నారని, మహారాష్ట్రలో అయితే బీఆర్ఎస్ సుడిగాలి వేగంతో దూసుకెళుతోందని అన్నారు.

లక్ష్యం లేని దేశం ఎక్కడకు వెళ్తోందని బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రశ్రించారు. దేశంలో ఎలాగైనా ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ల‌క్ష్యంగా మారిందని, ఎన్నిక‌ల రాజకీయతంత్రంలో దేశం చిక్కుకుపోయిందన్నారు. ప్రతి ఎన్నికలోనూ నేతలు కాదు.. ప్రజలు గెలవాలన్నారు. మ‌హారాష్ట్రలో 8 రోజుల‌కు ఒక‌సారి తాగునీరు వ‌స్తుంది. గంగా, య‌మునా డెల్టా ప్రాంత‌మైన ఢిల్లీలోనూ ఇదే దుస్థితి ఉంది. ఢిల్లీలో తాగునీరే కాదు.. విద్యుత్ కొర‌త స‌మ‌స్య కూడా ఉంద‌ని తెలిపారు కేసీఆర్…దేశ‌మంతా తెలంగాణ మోడ‌ల్ అమ‌ల‌య్యే వ‌ర‌కు పోరాడుతూనే ఉంటాను..రైతులు బ‌ల‌హీనులు కాదు.. దేశాన్ని న‌డుపుతున్న బ‌ల‌మైన శ‌క్తులు అని కేసీఆర్ ప్ర‌శంసించారు. రైతుల‌ను అవ‌మానించే వారికి త‌గిన శాస్తి త‌ప్ప‌దని హెచ్చ‌రించారు. దేశానికి అన్నం పెట్టే రైతు పార్ల‌మెంట్‌లో చ‌ట్టాలు చేయ‌లేడా? అని ప్ర‌శ్నించారు. దేశంలో 48 శాతం మంది రైతులే ఉన్నారు. వ్య‌వ‌సాయానికి ప్రాధాన్య‌త ఇస్తే 60 శాతం మందికి ఉపాధి ల‌భిస్తుంది. స‌రిప‌డా సాగునీరు, విద్యుత్ ఇవ్వ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం కావాల‌న్నారు. మ‌హారాష్ట్ర బ‌డ్జెట్ రూ. 10 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాలి. మధ్య‌ప్ర‌దేశ్‌లో కూడా బీఆర్ఎస్ రావాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారని కేసీఆర్ తెలిపారు..