సీఎం కేసీఆర్ కు నూతన హంగులతో కొత్త కాన్వాయ్..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖాతాలో మరో కొత్త కారు చేరింది. సీఎం కేసీఆర్ భద్రతను కట్టుదిట్టం చేయడంలో భాగంగా ఆయన కాన్వాయ్‌లోకి 1 కోటీ 30 లక్షల రూపాయల ఖరీదైన ల్యాండ్ క్రూజర్‌ను అధికార యంత్రాంగం చేర్చింది. ఎన్నో ప్రత్యేకతలను కలిగిన ఈ ల్యాండ్ క్రూజర్‌ వెహికిల్‌కి యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వాహన పూజ చేశారు. ఈ మేరకు యాదాద్రి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శివాలయం ఎదురుగా కూడా సీఎం కాన్వాయ్‌లో చేరిన ల్యాండ్ క్రూజర్‌కు శాస్త్రోక్తంగా పూజలు చేశారు.ఈ వెహికిల్‌కి ఆయా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా.. ఈ ల్యాండ్ క్రూజర్ రాకముందు సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో 15 కార్లు ఉండేవి. తాజాగా చేరిన ఈ క్రూజర్‌తో కాన్వాయ్‌లో వెహికిల్స్ సంఖ్య 16కి చేరింది.