ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మహారాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం సోలాపూర్‌కు చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రెండు ప్రత్యేక బస్సులు, భారీ కార్ల కాన్వాయ్‌తో బయలుదేరి వెళ్లిన విషయం తెలిసిందే. మధ్యాహ్నం ధారాశివ్ జిల్లా ఒమర్గాలో మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ తర్వాత సాయంత్రం సోలాపూర్‌కు చేరగా.. ముఖ్యమంత్రికి బీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ రాత్రి సోలాపూర్‌లోనే బస చేయనున్నారు.అక్కడ రుక్మిణీ సమేత విఠేశ్వరస్వామివారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. జిల్లా నేత భగీరథ్ బాల్కే సహా పలువురు నాయకులు సీఎం సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరుతారు. ఆ తర్వాత ధారాశివ్ జిల్లాలో కొలువుదీరిన శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్ర బీఆర్‌ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యే, సీనియర్ బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారు..
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.