యావత్‌ దేశం,,తెలంగాణను చూసి ఆశ్చర్య పోతుంది.. సీఎం కేసీఆర్..

CM KCR Speech at Golconda Fort తెలంగాణ ప్రగతి చూసి యావత్‌ దేశం ఆశ్చర్యపడుతోంది..

గతంలో రాష్ట్రంలో ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు ఉండేవని.. విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అనతి కాలంలోనే రాష్ట్రం తిరుగులేని విజయాలు సాధించిందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ.
తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలో తెలంగాణ రాష్ట్రం నంబర్‌ వన్‌గా ఉందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. గొల్కొండ కోట స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం కేసీఆర్‌ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించారు. గత నెలలో అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిస్తే…తక్షణ చర్యలకు 500 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రైతుల సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా దేశానికి తెలంగాణ ఆదర్శంగా ఉందన్నారు. రెండు దశల్లో దాదాపు 37వేల కోట్ల రుణమాఫీ చేశామని.. రైతులకు ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదని సీఎం కేసీఆర్ తెలిపారు.