51 మందికి బీ ఫామ్ ఇస్తున్నాం.. సీఎం కేసీఆర్..

*పార్టీ అభ్యర్థులతో సీఎం కేసిఆర్.*.

కీలక అంశాలపై అభ్యర్థులకు దిశా నిర్దేశం చేసిన కేసిఆర్

తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశమైన సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ తొందరపడొద్దని సూచించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అభ్యర్థులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని.. ప్రతీ కార్యకర్తను కలవాలని సూచించారు…

తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (CM KCR) ముందు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరిని మార్చే ఉద్దేశ్యం ఉందా?. ముందు ప్రకటించిన 115 మందిలో ఒకరు పార్టీ మారగా మిగతా 114 మందిలో అందరికీ బీ-ఫామ్స్ ఇవ్వరా?..అనే సందేహాలకు తావిచ్చేలా సీఎం కేసీఆర్ వ్యవహరించారని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కేవలం 51 బీఫామ్స్ మాత్రమే సిద్ధంగా ఉన్నాయని, మిగతావి సిద్ధమవుతాయని అనడమే ఇందుకు దారితీసింది. బీఫామ్స్‌లో సిద్ధమవ్వలేదని కేసీఆర్ చెప్పడాన్ని నమ్మొచ్చా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 21న బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిందని, దాదాపు 50 రోజుల తర్వాత బీఫామ్స్ సిద్ధంగాలేవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న పార్టీ, ఎన్నో ఎన్నికలను ఎదుర్కొన్న పార్టీ ఇంకా బీఫామ్స్ రెడీ అవ్వలేదనడం ఆ పార్టీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అంశమని అంటున్నారు.

అసంతృప్తులు బయటకు వెళ్లకుండా నియంత్రించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘నాలుగైదు తప్ప సిట్టింగులందరికీ సీట్లు వస్తాయని నేను ముందే చెప్పాను. రానివారు బాధపడొద్దని చెప్పాం, వారికి మరిన్ని అవకాశాలుంటాయని కూడా చెప్పాం.

నామినేషన్లకు ఇంకా సమయం ఉంది..హైరానా పడకండి..

ముందుగానే బీ ఫామ్ ఇస్తున్నాం..
.జాగ్రత్తగా బీ ఫామ్స్ నింపండి..చివరి రోజు వరకు సమయం ఉందని ఆగమాగం అవకండి

చివరి రోజే అందరూ వేయాలని ఇబ్బంది పడకండి..

బీ ఫామ్స్ తప్పుగా నింపకంది..

టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి…

శ్రీనివాస్ గౌడ్ , గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణ మోహన్ రెడ్డి తోం పాటు కొంత మంది తప్పుగా అఫిడవిట్ ఇచ్చారని కేసులు పెట్టారు..

అలాంటి అజాగ్రత్త ఉండకండి…

న్యాయ కోవిదులు ఉన్నారు..

అంత మాకే తెలుసు అనుకోకండి..

కచ్చితంగా వారిని సంప్రదించాలి..

ఎన్నికకు ఎన్నికకు కొత్త నిబంధన వస్తున్నాయి

తమ దగ్గర న్యాయవాదుల టీమ్ ఉంది..

అప్డేట్ ఓటర్ లిస్ట్ వచ్చింది ..

ఇవాళ రేపు కూడా బీ ఫామ్ ఇస్తాం…

*ఇవాళ ఒక్కరోజు 51 మందికి బీ ఫామ్ ఇస్తున్నాం..

కేసీఆర్ ప్రకటించే మేనిఫెస్టో పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కాంగ్రెస్ బిజెపిలకు పోటీగా కెసిఆర్ ఇలాంటి మేనిఫెస్టో ప్రకటిస్తారని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారం చేపట్టాలంటే… ఉన్న పథకాలను మరింతగా మెరుగుపరచడం కొత్త పథకాల ప్రకటనపై అంతా ఆశ పెట్టుకున్నారు. రైతులు, మహిళల కోసం ప్రత్యేక పథకాలు, రైతాంగం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత, మహిళా సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ, దిగువ, మధ్యతరగతి కుటుంబాల కోసం కొత్త పథకాలు, ఒంటరి మహిళలు, బీసీలు, మైనారిటీల కోసం స్పెషల్ స్కీమ్స్‌, యువత, గృహిణులు, ఒంటరి మహిళల కోసం ప్రత్యేక పథకాలు ఉంటాయని అంటున్నారు.