తెలంగాణ సీఎం KCRతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలోని మంత్రుల బృందం భేటీ…

తెలంగాణ సీఎం KCRతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి Niranjan Reddy నేతృత్వంలోని మంత్రుల బృందం శుక్రవారం నాడు Pragati Bhavanలో భేటీ అయింది.Punjab రాష్ట్రం నుండి Paddy ధాన్యం కొనుగోలు చేసినట్టే Telangana నుండి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కేంద్ర ఆహార శాఖ మంత్రిని తెలంగాణ మంత్రులు గురువారం నాడు కలిశారు. బుధవారం నాడు కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను తెలంగాణ మంత్రులు కలిశారు. అయితే గురువారం నాడు కలుద్దామని తెలంగాణ మంత్రులకు కేంద్ర మంత్రి Piyush Goyal సూచించారు.

గురువారం నాడు తన చాంబర్ లో తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ ,పువ్వాడ అజయ్ కుమార్ లు ఈ నెల 22వ తేదీన ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం కొనుగోలు అంశానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి వైఖరిని తెలంగాణ మంత్రులు న్యూఢిల్లీలో మండిపడ్డారు.

కేంద్ర మంత్రితో జరిగిన చర్చకు సంభాషణకు సంబంధించిన సారాంశాన్ని మంత్రుల బృందం కేసీఆర్ కు వివరించనున్నారు. తెలంగాణలో ఉత్పత్తి అయిన వరి ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం.