రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రిలో సీతారాముల కల్యాణ వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందన్నారు. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన వ్యక్తి మహోన్నత ప్రజా పాలకుడు శ్రీరాముడు అని కొనియాడారు. లోకకల్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్రబంధం అజరామరమైందని, భవిష్యత్ తరాలకు ఆదర్శనీయమైనదని సీఎం పేర్కొన్నారు. సీతారాముల ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని సీతారామచంద్రులను సీఎం కేసీఆర్ ప్రార్థించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.