పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జండాను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లో ఎనిమిదవ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ ముందుగా తెలంగాణ అమర వీరుల స్థూపానికి నివాళులర్పించారు.
ఆపై పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు.
అనంతరం ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడుతూ……అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.