★ రాకేశ్ కుటుంబానికి రూ. 25 లక్షల సహాయం
★ కుటుంబంలో అర్హులకు తగిన ఉద్యోగం
★ బాధితులకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్
..కేంద్రం వల్లే రాకేశ్ బలయ్యాడని ఆగ్రహం
సైన్యం, సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల
ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎం అండగా నిలిచారు. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు, ఆయన కుటుంబంలో అర్హులైనవారికి తగిన ప్రభుత్వోద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు..కేంద్ర ప్రభుత్వ దుర్మార్గ విధానాల వల్లనే రాకేశ్ బలైపోయాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సైనికులపై, వారి కుటుంబాల పట్ల ముఖ్యమంత్రి అవ్యాజమైన అభిమానాన్ని చాటుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గల్వాన్ లోయలో చైనా కుట్రకు బలైపోయిన కర్నల్ సంతోష్‌బాబు కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా.. ఆయన భార్యకు గ్రూప్1 ఉద్యోగాన్ని ఇచ్చిన సంగతి తెలిసిందే…