పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష…

పాలమూరు-రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని, డిండి ప్రాజెక్టు పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలరి సీఎం ఆదేశించారు. రెండు ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్లోనూ నిధులు కేటాయిస్తామని ప్రకటించారు. అత్యవసర పనులను అధికారులే నిధులు మంజూరు చేయాలన్నారు. మస్కూరీలను నీటి పారుదలశాఖలో విలీనం చేసి లష్కర్లుగా వినియోగించాలని కేసీఆర్‌ సూచించారు. ఈ సమీక్షలో మంత్రి జగదీశ్‌ రెడ్డి, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.