మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం…

*మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై దిశానిర్థేశం మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమించిన సీఎం
గ్రాడ్యుయేట్ ఎమ్మల్సీ ఎన్నికల నేపథ్యంలో మంత్రులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానానికి ఇంచార్జ్‌లుగా మంత్రులను నియమించారు. హైదరాబాద్ జిల్లా ఇంఛార్జ్‌గా గంగుల కమలాకర్, రంగారెడ్డి ఇంఛార్జ్‌గా హరీష్ రావు, మహబూబ్‌నగర్ ఇంఛార్జ్‌గా ప్రశాంత్‌రెడ్డిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఆయా జిల్లాల మంత్రులు పార్టీ శ్రేణుల సమన్వయంతో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పనిచేయాలని సీఎం సూచించారు. అభ్యర్థి ప్రచారానికి రాకున్నా.. మీరే మొత్తం భుజాన వేసుకుని పనిచేయాలని మంత్రులను కేసీఆర్ ఆదేశించారు.