రేపు యాదాద్రి ఆలయానికి సీఎం కేసీఆర్ ..

రేపు యాదాద్రి ఆలయానికి
సీఎం కేసీఆర్ వస్తున్నారు….
ఆలయ పునర్నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి,, సమీక్ష నిర్వహించనున్నారు…..

ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటన ఖరారైంది. సీఎం kcr రేపు యాదాద్రిని దర్శించనున్నారు. శరవేగంగా కొనసాగుతున్న ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు ఆలయ పనులకు సంబంధించిన నివేదికను కూడా సిద్ధం చేస్తున్నారు. ఆలయ పనుల పురోగతిపై ఆయన అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తారు. ఆలయ పనుల్లో అధికారులకు సలహాలు, సూచనలు చేయనున్నారు..ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు సంబంధించిన రూ.900 కోట్ల పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. లక్ష్మీనరసింహస్వామి కొలువైన గర్భగుడి చుట్టూ చేపట్టిన పనులు 90 శాతం పూర్తి అయ్యాయి..