యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం కెసీఆర్

యాదాద్రి లో
సీఎం కేసీఆర్ టూర్…

కొండ పైన హరిత టూరిజం హోటల్ కు చేరుకున్న సీఎం కేసీఆర్…
భోజన విరామం తర్వాత రింగ్ రోడ్డు..,,
గండి చెరువు అభివృద్ధి పనులు..
విప్ సూట్స్..
ప్రసిడెన్షియల్ సూట్స్ పనులను పరిశీలన చేయనున్న సీఎం కేసీఆర్….

యాదాద్రి ప్రధానాలయం.. నిర్మాణం ……
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్రత్యేకంగా తయారు చేయించిన
క్యూ లైన్లు లను పరిశీలించిన సీఎం కేసీఆర్….
బంగారు వర్ణం లో
తయారు చేయబడి..
వాటిపై
శంకుచక్రాలు. గోవిందా నామాలు,
ముఖ మండపం,ఐరావతం బొమ్మలు, అల్లికలు,
లను ప్రత్యేకంగా పరిశీలించిన
సీఎం కేసీఆర్…….

యాదగిరిగుట్టలో ఆలయ అభివృద్ధి పనులను సీఎం కేసీఆర్‌ పరిశీలిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా యాదగిరిగుట్టపైకి చేరుకున్నారు. నేరుగా బాలాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆయనకు అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్థపతి వేలు, ఆనంద్‌ సాయి, యాడా అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు పనులపై దిశా నిర్దేశం చేస్తున్నారు..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నభూతో నభవిష్యత్‌ అన్న రీతిలో నిర్మిస్తున్న టెంపుల్‌ సిటీ యాదాద్రిని నిర్మిస్తుంది. రేయింబవళ్లు సాగుతున్న ఆలయ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించడం ప్రాధాన్యతనున సంతరించుకుంది. ఈ సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.

రాజగోపురాలు,,
ఐరావత విగ్రహాలు,
ప్రాకారాలు,,
మాడ వీధులు,
కల్యాణ మండపం..
ఫ్లోరిన్ పనులు,,
ద్వారాలు..
ఆళ్వారుల విగ్రహాలు..
ధ్వజస్తంభం
లను
పరిశీలించిన
సీఎం కేసీఆర్…..

గతంలో తన ఆదేశాలతో ఏ మేరకు పనులు జరిగాయి? ఇంకా అసంతృప్తిగా ఉన్న వాటిపై ఆరా తీశారు. కొండ దిగువన పచ్చదనం పెంపు, కాలికనడక నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో సుందరీకరణ, విద్యుద్దీపాలు ఏర్పాటు చేసేందుకు స్తంభాలకు సంబంధించిన వివరాలు ఆనంద్‌ సాయి సీఎంకు వివరించారు. ప్రధాన ఆలయ ప్రాగణంలో కలియదిగారు. మాఢ వీధులు, ప్రాకార మండపాలు, దర్శన సముదాయాలను, బ్రహ్మోత్సవం మండపాన్ని, తూర్పు రాజగోపురం వద్ద క్యూలైన్లను పరిశీలించారు.

గతేడాది సెప్టెంబర్‌ 13న యాదాద్రికి వచ్చిన సీఎం కేసీఆర్‌, ఐదు నెలల అనంతరం మళ్లీ క్షేత్రంలో పర్యటిస్తున్నారు. లక్ష్మీనృసింహస్వామి ప్రధాన ఆలయం పునః ప్రారంభం ఘనంగా నిర్వహించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఈ మేరకు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించేందుకు యాద్రాద్రిలో పర్యటిస్తున్నారు. రూ.1200 కోట్లతో పునః నిర్మాణ పనులు 2016, అక్టోబర్‌లో శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు సుమారు రూ.850 కోట్లు వెచ్చించినట్లు యాడా అధికారులు పేర్కొన్నారు. పూర్తిగా కృష్ణశిలతో నిర్మించిన ఆలయం అద్భుత గోపురాలు, ప్రాకారాలు, దశావతారాలు, ఆళ్వారులు, శిల్పాలతో అలరాలుతోంది.