సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం.మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున పరిహారం…

సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం..

మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున పరిహారం

సికింద్రాబాద్‌లోని బోయిగూడ అగ్నిప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున సీఎం ప‌రిహారం ప్ర‌క‌టించారు. మృత‌దేహాల‌ను బీహార్‌కు పంపించే ఏర్పాట్లు చేయాల‌ని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు…

టింబ‌ర్ డిపోలో చెల‌రేగిన మంట‌ల‌కు మొత్తం 11 మంది మృతి చెంద‌గా, ఒక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మృతుల్లో కొంద‌రు స‌జీవ‌ద‌హ‌నం కాగా, మ‌రికొంద‌రు ఊపిరాడ‌క ప్రాణాలు కోల్పోయారు. మృత‌దేహాల‌కు గాంధీ ఆస్ప‌త్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వ‌హిస్తున్నారు. గాయ‌ప‌డిన వ్య‌క్తికి కూడా గాంధీ ఆస్ప‌త్రిలోనే చికిత్స అందిస్తున్నారు…

సికింద్రాబాద్‌లోని బోయిగూడలో అగ్నిప్రమాద ఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఆయన.. ప్రమాదానికి గల వివరాలను తెలుసుకున్నారు. అగ్నిప్రమాదం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. ఈ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించామని, విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని మంత్రి వెల్లడించారు…

మొత్తం మృతుల వివరాలు…
ఈ ప్రమాదంలో పదకొండు మంది అక్కడికక్కడే మరణించారని అధికారులు చెప్పారు. వీరిలో కొందరు సజీవదహనమవగా, మరికొందరు ఊపిరాడక చనిపోయారన్నారు. మరొకరు క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ప్రమాద సమయంలో టింబర్‌ డిపోలో 12 మంది ఉన్నారని చెప్పారు. మృతులంతా బీహార్‌కు చెందిన వలస కార్మికులని తెలిపారు. మృతులను బిట్టు, సికిందర్‌, దామోదర్‌, సత్యేందర్‌, చింటు, దినేష్‌, రాజేష్‌, రాజు, దీపక్‌, పంకజ్‌గా గుర్తించామన్నారు.