ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఘ‌నంగా ద‌స‌రా వేడుక‌లు.. కుటుంబ స‌మేతంగా సీఎం కేసీఆర్‌ ప్ర‌త్యేక పూజ‌లు…

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఘ‌నంగా ద‌స‌రా వేడుక‌లు.. కుటుంబ స‌మేతంగా సీఎం కేసీఆర్‌ ప్ర‌త్యేక పూజ‌లు..

విజయ దశమి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు (CM KCR) ప్రగతి భవన్‌లోని నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. సంప్రదాయ బద్దంగా వాహన పూజ, అయధ పూజ ఘనంగా నిర్వహించారు. దసరా సందర్భంగా జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులు, సిబ్బందిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో సీఎం కేసిఆర్ సతీమణి శోభమ్మ, మున్సిపల్ శాఖ మంత్రి కె. తారక రామారావు, శైలిమ దంపతులు, సీఎం మనుమడు హిమాన్షు, మనుమరాలు అలేఖ్య, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి, సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, తదితర కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.