రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్..

రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

ఆలయ పునః ప్రారంభ తేదీ ,వివరాల ప్రకటన

రేపు (మంగళవారం,19 అక్టోబర్) యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఉదయం 11.30 కు హైద్రాబాద్ నుండి బయలుదేరి వెళతారు.యాదాద్రి పుణ్యక్షేత్రం పునర్నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో ముగిసిన నేపథ్యంలో అన్నీటిని మరోసారి సిఎం కెసిఆర్ పరిశీలిస్తారు.యాదాద్రి పున:ప్రారంభం తేదీ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్ స్వామివారు నిర్ణయించి వున్నారు. యాదాద్రిలోనే ఆలయ పున: ప్రారంభం తేదీలను సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటిస్తారు.పున: ప్రారంభం సందర్భంగా నిర్వహించనున్న మహా సుదర్శన యాగం వివరాలను,తేదీలను కూడా సిఎం కెసిఆర్ ప్రకటించనున్నారు…