తెలంగాణలో పోడు భూముల సమస్యలు, అటవీ పరిరక్షణ పై సీఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష…

R9TELUGUNEWS.com.

*పోడు భూముల సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించిన సీఎం…తెలంగాణలో పోడు భూముల సమస్యలు, అటవీ పరిరక్షణ పై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఉన్నతాధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో గత కొన్నిరోజులుగా అటవీ అధికారులు, గిరిజనుల మధ్య కొనసాగుతున్న వివాదాలు, పోడు భూములను పరిరక్షిస్తూనే గిరిజనులకు ఏ విధంగా సహాయం చేయాలన్నఅంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఇక అడవులను పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలనుకూడా ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ చర్చించారు.అటవీ భూములు కబ్జాలకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఒక పర్యావరణపరిరక్షణ,పచ్చదనం పెంపు విషయంలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్నిపూర్తిస్థాయిలో విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడా సమావేశంలో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ ఉన్నతాధికారులు, రెవెన్యూఅధికారులు పాల్గొన్నారు