కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు….హరీష్ రావు..

కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారు – హరీష్ రావు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారని, ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీని నిలదీస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ సెకండ్ ఇన్నింగ్స్ మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడు, ప్రజానాయకుడు, రానేరాదన్న తెలంగాణను 14ఏళ్లు పోరాడి సాధించిన నేత కేసీఆర్ అని హరీష్ రావు అన్నారు. తెలంగాణ సంక్షేమంకోసం, ప్రజల అభివృద్ధికోసం అలుపెరగని పోరాటం చేస్తారు, రాబోయే రోజుల్లో మీరే చూస్తారు అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంకు ప్రజల కష్టాలు పట్టడం లేదు.. ప్రజలకు కష్టాలు పెరగడమే కాంగ్రెస్ ప్రభుత్వంతో వచ్చిన మార్పు అంటూ హరీష్ రావు ఎద్దేవా చేశారు..