ఈ నెల 13 నుండి 28 వరకు సీఎం కేసీఆర్ పర్యటన.. మరో 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు..

ఈ నెల 13 నుండి 28 వరకు సీఎం కేసీఆర్ పర్యటన..
మరో 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గాల పర్యటన రెండో షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన అధినేత పర్యటనలు గురువారం(నవంబర్ 3, 2023) నాటికి 12 రోజుల్లో 30 నియోజకవర్గాల్లో విజయవంతమయ్యాయి. ఈ నెల 5 నుండి 8 వ తేదీ వరకు మరో 11 నియోజకవర్గాల్లో సీఎం పర్యటన చేపట్టనున్నారు.

రెండవ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుండి 28వ తేదీ వరకు సీఎం కేసీఆర్ గారు 16 రోజులపాటు నియోజకవర్గాల పర్యటన కొనసాగనున్నది. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో బీఆర్ ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ నెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనుంది. దాంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తికానున్నది.