సీఎం కేసీఆర్ అనారోగ్యం పై స్పందించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..

స్వల్ప అనారోగ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్టు పెడుతూ..సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారన్న సమాచారం ఆందోళనకు గురిచేసింది.అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు…