రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం..
కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్రంలో విద్యావ్యవస్థను బలోపేతం చేస్త ముఖ్యమంత్రి మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా, అక్టోబర్ 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం కానుంది…
ఈ మేరకు సీఎం బ్రేక్ ఫాస్ట్ మెనూ ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మహేశ్వరం నియోజకవర్గం రావిర్యాల జడ్పీహెచ్ఎస్‌లో ఈ పథకాన్ని శుక్రవారం ఉదయం 8:45 గంటలకు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలల్లో 23 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనున్నారు. పాఠశాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వనున్నారు..
బ్రేక్ ఫాస్ట్ మెనూ
సోమవారం – ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం – పూరి, ఆలు కుర్మ లేదా టమాటా బాత్ విత్ రవ్వ, చట్నీ..
బుధవారం – ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్నీగురువారం – మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం – ఉగ్గాని/ పోహా/మిల్లెట్ ఇడ్లీ, చట్నీ లేదా గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ
శనివారం – పొంగల్/సాంబార్ లేదా వెజిటబుల్ పొలావ్, రైతా/ఆలు కుర్మ..