ఎన్నికల సమరానికి సిద్ధమైన సీఎం కేసీఆర్..!..
సీట్ల పంపకానికి సంబంధించి చర్చలు జరపాలని వామపక్షాల నేతలు నిర్ణయం..
*Big Breaking :*
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలోఎన్నికలు జరిగిన బీఆర్ఎస్ కు 105 సీట్లు ఖాయమని సన్నిహిత నాయకులతో సర్వే వివరాలు వెల్లడించినట్టుగా ప్రచారం… ప్రజలకు ఏం చేశామో చెప్పుకుంటే చాలని పార్టీ నేతలతో సీఎం అన్నారు. అదే మనల్ని గెలిపిస్తుందంటూ పలుమార్లు నాయకులకు సీఎం కేసీఆర్ సూచించారు…
ఎన్నికల సమరానికి సిద్ధమైన సీఎం కేసీఆర్ ,బీఆర్ఎస్ పార్టీ 80నుండి 100 మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన సీఎం కేసీఆర్ 80 శాతం సిట్టింగ్ లకే అవకాశం ఇచ్చే చాన్స్.., 8 నుంచి 15 మందిని మార్చే ఛాన్స్.. మారో వారం, పది రోజుల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం….
ఎవరివి ఆగుతాయి ఎవరి పేర్లు ప్రకటిస్తారు అనే అంశంపై బిఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది… ఏది ఏమైనా ఈ టెన్షన్ కి తరపడాలంటే మరో వారం పది రోజులు ఆగాల్సిందే..
అభ్యర్థుల ప్రకటించిన బిఫామ్ ఇచ్చేదాకా వేచి చూడాల్సిందే మరీ అంటున్నరు రాజకీయ విశ్లేషకులు..
ఇదిలా ఉండగా సీట్ల పంపకానికి సంబంధించి చర్చలు జరపాలని వామపక్షాల నేతలు నిర్ణయం..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో సీట్ల పంపకానికి సంబంధించి చర్చలు జరపాలని వామపక్షాల నేతలు నిర్ణయించారు. మూడు రోజుల క్రితం ముగ్దూం భవన్ లో సీపీఐ, సీపీఎం కార్యదర్శులు, ముఖ్యనేతలు సమావేశమై, బీఆర్ఎస్ తో చర్చలు జరపాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ క్రమంలో వారు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఒకటి రెండు రోజుల్లో అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం సమాచారం ఇచ్చింది. అపాయింట్‌మెంట్ ఖరారయ్యాక వామపక్షాల నేతలు… ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు.