ఈ నెల 5న దసరా పండుగ రోజున టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ ఆదివారం సమావేశమయ్యారు. భేటీకి మంత్రులు, ఎంపీలతో పాటు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై నేతలతో చర్చించారు. దసరా పండుగ రోజున టీఆర్ఎస్ కార్యవర్గ పార్టీ సమావేశం జరుగనున్నది. జాతీయ పార్టీగా మార్పుపై 283 మంది టీఆర్ఎస్ సభ్యులతో విస్తృత స్థాయి తీర్మానం ప్రవేశపెట్టి.. ఆమోదం తెలుపనున్నారు. అదే రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు మూహూర్తం నిర్ణయించగా.. జాతీయ పార్టీపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయనున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 9న ఢిల్లీలో బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. సమావేశం అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ దసరా రోజున జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు తెలిపారు…5న సీఎం కేసీఆర్ సంచలనాత్మక ప్రకటన చేయబోతున్నారన్నారు. దేశ ప్రజలు, యువతా సీఎం కేసీఆర్ రాక కోసం చూస్తున్నారని, కొన్ని పార్టీలు విలీనం కావడంతో పాటు మరికొన్ని పార్టీలు కలిసివచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ విషయాలన్నింటిని పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ వివరిస్తారన్నారు. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశమై.. పార్టీలో అందరితో చర్చించి తీర్మానం పెట్టనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 1.19 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటన చేస్తారన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.