జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయం..!!!!

*జాతీయ పార్టీ ఏర్పాటు చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయం..

కెసిఆర్ కొత్త పార్టీ పేరు BRS..!!! ?

భారత్ రాష్ట్రీయ సమితి..

ఢిల్లీలో కొత్త పార్టీ ప్రకటన…!!!

ఈ నెల ఆఖరు లో పార్టీ ప్రకటన…!!!

మంత్రులు, విప్‌లు, ఎంపీలు, ముఖ్య నాయకులతో సుదీర్ఘ భేటీలో సీఎం చర్చ..!!

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రగతిభవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్‌.. రాష్ట్ర మంత్రులు, అందుబాటులో ఉన్న పార్టీ ఎంపీలు, ప్రభుత్వ విప్‌లతో సుదీర్ఘ భేటీ నిర్వహించారు…

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం… కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయిలో ఘోరంగా విఫలం అయింది… ఈ రెండు పార్టీలను ఎదుర్కొనేందుకు కొత్త పార్టీ అవసరం.. ఏర్పాటు చేస్తే ఏ పేరు పెడదాం? కలసి వచ్చే వారితో రాజకీయాల్లో చురుకుగా దూసుకుపోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల ఇతర రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి. జాతీయ పార్టీ ఏర్పాటు ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న పథకాలు దేశమంతటా అమలు చేసేందుకు వీలు కలుగుతుంది.. అని మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నట్టు సమాచారం. జాతీయ స్థాయిలో పార్టీ పెడితే దానికి ఏ పేరు పెట్టాలి.. కేంద్ర బిజేపి రాష్ట్రాన్ని ఆర్థికంగా దిగ్బంధించి రాజకీయం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, దీన్ని ఎదుర్కొనేందుకు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నట్టు తెలిసింది..