సీఎం కేసీఆర్ జిల్లాల ప‌ర్యట‌న‌.. నేరుగా కార్యకర్తలతో మాట ముచ్చట్లు..!!…

తెలంగాణ‌ ద‌శాబ్ది వేడుక‌లు… మ‌రోవైపు సీఎం కేసీఆర్ జిల్లా ప‌ర్యట‌న‌ల‌తో బీఆర్ఎస్ స‌ర్కార్ ఇప్పటి నుంచే ప్రచార పర్వానికి పదును పెట్టింది. ఇప్పటికే ఆత్మీయస‌మ్మేళ‌న‌ల‌తో ప్రజ‌ల మధ్యలో ఉన్నా గులాబీ లీడర్లకు ఇప్పుడు కేసీఆర్ జిల్లా ప‌ర్యట‌న‌లు మ‌రింత ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలతో ప‌దేళ్ల పండుగ మ‌రింత క‌ళకళ లాడ‌నుంది…
కర్ణాట‌క ఎన్నిక‌ల త‌ర్వాత‌ తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. అధికార, విపక్షాలు ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే… హ్యాట్రిక్ కోసం సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. ఇప్పటి నుంచే తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు.