క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం…

క‌శ్మీర్ ఫైల్స్ సినిమాపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి స‌మావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని లేవ‌నెత్తారు. దేశానికి కావాల్సింది క‌హ్మీర్ ఫైల్స్ కాదు.. డెవ‌ల‌ప్‌మెంట్ ఫైల్స్ కావాల‌న్నారు. దేశంలో స‌మ‌స్య‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికే ఈ సినిమాను విడుద‌ల చేశార‌ని మండిప‌డ్డారు… దేశంలో సమస్యలు పక్కదారి పట్టించడానికే సినిమా విడుదల చేశామరి ఆగ్రహం వ్యక్తం చేశారు…. బిజెపి అన్ని రంగాల్లో డ్రామాలు మొదలు పెట్టిందని ఆఖరికి సినిమాలో పేరుతో కూడా ప్రజలకు వాస్తవాలు తెలవకుండా సెంటిమెంట్ లతో ఆడుకుంటుంది అని అన్నారు..