కేంద్రానికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్‌ కౌంటర్‌..

*కేంద్రానికి కేసీఆర్ స్ట్రాంగ్‌ కౌంటర్‌…

R9TELUGUNEWS.COM…కేంద్రానికి సీఎం కేసీఆర్ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్‌ లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. అవసరం అయితే ఢిల్లీ దాకా వస్తామని, దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సివస్తే కొట్లాడ్డానికి సిద్దమని కేసీఆర్‌ అన్నారు. కేంద్రం కొన్ని సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, గోదావరి నీళ్లతో జనగామ పాదాలు కడిగేందుకు సిద్ధమని, విద్యుత్‌ సంస్కరణల పేరుతో మోదీ పంచాయితీ పెడుతున్నారని జనగామ బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ అన్నారు..

ద్ధాన్ని కొనసాగిస్తున్నారు. జనగాం వేదికగా మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ప్రజా వేదికగా తూర్పారబట్టారు. రేట్లు పెంచుతున్న విధానం, ప్రభుత్వ ఆస్తుల విక్రయం, విద్యుత్ అంశాలు సహా ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బహిరంగ సభలో కేసీఆర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే ఇప్పుడు చూద్దాం.. ‘‘కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. ప్రస్తుతం తెలంగాణ రూపు రేఖలే మారిపోయాయి. నీటి బాధలు, కరెంట్ బాధలు పోయాయి. కేంద్ర ఏం ఇవ్వకున్నా ఉన్నవాటితో సరిపెట్టుకున్నాం. ఎనిమిదేళ్లలో కేంద్ర ప్రభుత్వంతో ఎప్పుడన్నా కొట్లాట పెట్టుకున్నామా? కానీ, ఇప్పుడు నరేంద్ర మోదీ పంచాయితీ మొదలైంది. కరెంట్ సంస్కరణల పేరుతో మోటార్లకు మీరు పెట్టాలంటున్నారు. నన్ను చంపినా పెట్టనని తెగేసి చెప్పిన.’’ అని అన్నారు.

కేంద్రానికి కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్..
‘‘దేశం నుంచి బీజేపీని తరిమేస్తాం. మాకు ఇచ్చేవాడిని తెచ్చుకుంటాం. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి వస్తే.. దేశం గురించి కొట్లాడేందుకు వెనుకాడం. ఇక్కడ బయలుదేరితే.. ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్త నరేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ. మీ ఉడుత ఊపులకు భయపడేది లేదు. టీఆర్ఎస్ యుద్ధం చేసిన పార్టీ. పోరాటం చేసిన పార్టీ. దేశం కోసం కూడా పోరాటం చేస్తాం. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం.’’ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు…