సీఎం కేసీఆర్ గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గు..మంత్రి కేటీఆర్..

సీఎం కేసీఆర్ గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు…వైద్య బృందంపర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. తొందర్లోనే కేసీఆర్ తిరిగి సాధారణస్థితికి చేరుకుంటారని వైద్యులు తెలిపారు . బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..

ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే.. కేసీఆర్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. కాగా.. ప్రగతిభవన్‌లోనే కేసీఆర్‌కు యశోద ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. అయితే.. కొద్ది రోజుల్లోనే సీఎం కేసీఆర్.. సాధారణ స్థితికి చేరుకుంటారని వైద్యులు చెప్పినట్టుగా తెలిపారు కేటీఆర్…రాష్ట్రంలో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా.. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వైరల్ జ్వరాలు తీవ్రంగా నమోదవుతున్నాయి. ఆస్పత్రుల్లో ఈ వైరల్ జ్వరాలకు సంబంధించిన కేసులు భారీగా నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనం. రోగులతో స్థానిక పీహెచ్‌సీలు నిండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే.. బెడ్లు సరిపోక బాధితులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఆస్పత్రుల్లో.. ఒక్కో బెడ్‌పై ఇద్దరిద్దరు రోగులను ఉంచి మరీ.. చికిత్స అందిస్తున్న దుస్థితి నెలకొంది..