సీఎం కెసిఅర్ వైద్య పరీక్షల పై..వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు వివరణ..

సీఎం కెసిఅర్ వైద్య పరీక్షల పై..వ్యక్తిగత డాక్టర్ ఎం.వి.రావు వివరణ…..

సీఎం కేసీఆర్ కి ప్రతి ఏటా ఫిబ్రవరిలో రెగ్యులర్ చెకప్ చేస్తుంటాం. రెండు రోజులుగా వీక్ గా ఉన్నట్లు చెప్పారు, నార్మల్ పరీక్షలు చేశాం.
ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంచెం నొప్పిగా ఉందన్నారు. దీంతో ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలు చేస్తున్నాం.
సీఎం కెసిఅర్ కి సీటీ స్కాన్, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేస్తున్నం.
రొటీన్ పరీక్షల్లో భాగంగానే చేస్తున్నాం.
రిపోర్టులను బట్టి ఏం చేయాలో చూస్తాం.
వారు స్టేబుల్ గా ఉన్నారు… ఆరోగ్యంగానే ఉన్నారు.. .

*ప్రమోద్. డాక్టర్.*

ఎడమ చేతి వైపు నొప్పిగా ఉందని సీఎం కేసీఆర్ చెప్పారు.అందుకే పొద్దున ఇంటికి వెళ్లి టెస్ట్ చేసాము.
ఎందుకైనా మంచిదని హాస్పిటల్ కి రమ్మని చెప్పాము.

యాంజియో గ్రామీ చేసాము ఎలాంటి ప్రాబ్లమ్ లేదని చెప్పారు.

మెడ,మెదడు రెండు టెస్ట్ లు చేసాము నార్మల్ గా ఉన్నాయి.

* ఇంటికి వెళ్లి పొద్దున 8 గంటలకు టెస్ట్ చేసాము.
* నెక్ దగ్గర కొంత పెయిన్ ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు.
* బీపీ, షుగర్ సీఎం కేసీఆర్ కి ఉన్నాయి.షుగర్ కొంచెం కంట్రోల్ చేసుకోవాలని చెప్పాము.
* కిడ్నీ, లివర్ బాగుంది.
* వారం రోజుల విశ్రాంతి అవసరం… నెల నెల టెస్టు లు కూడా చేస్తాము.
* డే కేర్ అడ్మిషన్ మాత్రమే తీసుకున్నాము.
* వారం రోజుల కు ఒక సారి షుగర్ టెస్ట్ చేసుకోవాలని సీఎం కేసీఆర్ కు చెప్పాము.