కాంగ్రెస్ లో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు… సిఎం కెసిఆర్..

హుజుర్‌న‌గ‌ర్ : కాంగ్రెస్ పార్టీలో డ‌జ‌న్ మంది ముఖ్య‌మంత్రులు ఉన్నార‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాడ వాడ‌కు సీఎంలే ఉన్నారు.. ప్ర‌తి ఒక్క‌రూ న‌న్ను గెలిపిచండి నేను ముఖ్య‌మంత్రి అయితా అంటున్నారు. అస‌లు కాంగ్రెస్ గెలిచే ప‌రిస్థితి లేదు అని కేసీఆర్ అన్నారు. హుజుర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర‌జా ఆశీర్వాద స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు…

గతంలో ఎన్నో ఎన్నికలు చూసాం ..ఎన్నోసార్లు ఓటు వేసాం..

మంచి చెడులను ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారు లేదంటే నాయకులు గెలుస్తారు..

ప్రజలు గెలిచే ఎన్నికలే నిజమైన ప్రజాస్వామ్య ఎన్నికలు.. అలాంటప్పుడే ప్రజలకు కావాల్సిన న్యాయం జరుగుతుంది…

నేను చెప్పే విషయాలు మీ గ్రామాల్లో చర్చించి ఓటు వేయాలి..

పార్టీల చరిత్ర, వైఖరి, దృక్పథం, ఎవరి కోసం పనిచేస్తుందనే అంశాలపై చర్చించాలి..

దళిత బిడ్డలు అనాదిగా అణచివేత, వివక్షకు గురవుతున్నారు..

దళితులు ఇంకెన్నేళ్ళు అలా ఉండాలి..

గిరిజనుల ఆకాంక్ష మా తండాలో మా పాలన ఉండాలనేది.. గతంలో పనిచేసిన వాళ్లు ఆ ఆలోచన లేదు.. అది ప్రజాస్వామ్యం కాదు..

యువత ఆలోచన చేయాలి.. అల్లాటప్పాగా ఓటు వెయోడ్డు..

ఓటు మన తలరాతను నిర్ణయిస్తుంది..ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్న అస్త్రం ఓటు..

జరిగిన చరిత్రను కూడా వక్రీకరిస్తారు…

నాగార్జున సాగర్ ఇప్పుడు కట్టిన ప్రాంతంలో కాకుండా.. ఏలేశ్వరం దగ్గర కట్టాలి.. ఇదే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆనాడు నోరు మూసుకున్నారు..

1956లో తెలంగాణను ఆంధ్రలో కలపాలంటే ప్రజలు వ్యతిరేకించారు.. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ పేరుతో ఉద్యమిస్తే ఏడుగురు విద్యార్థులను చనిపోయినా నోరు మూసుకున్నారు..

నిన్న జరిగిన చరిత్రను కూడా అబద్ధాలు చెప్తారు..

హుజూర్ నగర్ టెయిల్ ఎండ్ మండలాలు పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించాలి..

తెలంగాణ వచ్చాక వర్షాలు మంచిగా పడుతున్నాయి.. మంచి పాదం ఉంటే వర్షాలు మంచిగా కురుస్తాయని అంటారు..

నాగార్జున సాగర్ నుంచి 18 సార్లు నీటిని దిగువకు వదిలాం…

రెండు పంటలకు సాగు నీరు ఇస్తున్నాం..

టెయిల్ ఎండ్ కు నీళ్లు రాక కాలువల మీద రైతులు పడుకునేవాళ్లు..

టీ కాంగ్రెస్ నేతలు ఏనాడు కొట్లడలేదు..

కరెంటు ఎందుకు ఎందుకు ఇవ్వలేదు అనలేదు.. మంత్రి పదవి వస్తే చాలు అనుకున్నారు..

ఉన్నది ఉన్నట్టు చెప్తే ఉత్తంకుమార్ రెడ్డి ఎగిరెగిరి పడ్డాడు….

నాగార్జున సాగర్ కట్టవలసిన చోట కట్టలేదు.. రావాల్సిన నీళ్లు రాలేదు..

నీళ్ల కోసం నాగార్జున సాగర్ కట్ట మీద కొట్లాడితే తెల్లారే వరకు వచ్చాయి..

కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇవ్వం అన్నారు..

కాంగ్రెస్ నాయకులకు ఆనాడు పౌరుషం ఎక్కడికి పోయింది.. ప్రజల భాధ వాళ్లకు అవసరం లేదు..

1956లో పొరపాటు చేస్తే 59 ఏళ్లు ఏడ్చినం…

ఇదే కాంగ్రెస్ తెలంగాణ ఇస్తామని మోసం చేశారు..

14 ఏళ్ల తర్వాత కేసిఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అంటే దిగి వచ్చారు.. ఒక్కడైనా రాజీనామా చేశారా ?…

కాంగ్రెస్ లో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారు…

కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు..

గోల్ మాల్ చేసి ఓట్లు అడుగుతున్నారు…

రైతుల గురించి పట్టించుకున్న నాధుడు లేదు.. ఒక్కొక్క సమస్య తీరుస్తున్నాం..తాగు నీరు ఇచ్చి ఫ్లోరైడ్ సమస్య తీర్చుకున్నాం…

రైతు బంధు పదాన్ని పుట్టించింది కేసిఆర్…

తెలంగాణ పల్లెలు పచ్చబడాలని రైతు బంధు తెచ్చాం…

రైతు బంధును స్వామి నాథన్ మెచ్చుకున్నారు..

ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజల టాక్స్ దుబారా చేస్తున్నారు అంటున్నారు.. రైతు బంధు ఉండేలా.. వద్దా?..

నవంబర్ 30న పోలింగ్ బాక్స్ లు పగిలిపోవాలి…

కేసిఆర్ కలను తెలంగాణ రైతులు సాకారం చేశారు.. ధాన్యం ఉత్పత్తిలో 3 కోట్ల టన్నులు దాటాం.. 4 కోట్లు దాటి పంజాబ్ ను దాటుతాం..

వ్యవసాయానికి 3 గంటలు కరెంట్ ఇస్తే చాలు అంటున్నారు.. నేను కాపోన్నే.. ఎంత కరెంటు కావాలి.. ఎన్ని నీళ్ళు పెట్టాలనేది నాకు తెలుసు..

రాహుల్ గాందీ ధరణి తీసేయాలి అంటున్నారు…

ధరణి తెచ్చింది రికార్డులు పారదర్శకంగా ఉండాలని.. భట్టి విక్రమార్క ధరణి తీసి బంగాళా ఖాతంలో వేయాలి అంటున్నాడు.. ధరణి వల్ల రైతు బంధు మీ ఖాతాల్లో పడుతుంది…

ధరణి తీసేస్తే ఈ డబ్బులు ఎలా వస్తాయి.. మళ్లీ మొదటికి వస్తది…

ధరణి ఉండాలా..పోవాలా?..

రైతుల భూ రికార్డుల మీద వారికే హక్కులు కల్పించాం.. ముఖ్యమంత్రికి కూడా మార్చే హక్కు లేకుండా చేశాం..

పెన్షన్ ను రూ. 5 వేలకు.. రైతు బంధు రూ. 16 వేలకు తీసుకుపోతాం..

పేదలకు రేషన్ సన్న బియ్యం ఇస్తాం..

దేశంలో కంటి వెలుగు లాంటి పథకం ఎక్కడైనా ఆలోచించారా?

మేనిఫెస్టోను బలంగా ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి..

సైదిరెడ్డిని బంపర్ మెజారిటీ తో గెలిపిస్తే హుజూర్ నగర్ కి కావాల్సినవన్నీ ఇస్తాను..

ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం తీసుకోను అంటాడు.. శపధాలు కాదు.. ప్రజలు నీళ్లు కావాలి…