సీఎం కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఓ అభిమాని వినూత్న రీతిలో కాశీలోని విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నాడు..కాశీలో దీపారాధన..బోటుకు ఫ్లెక్సీ…

కాశీలో దీపారాధన.. బోటుకు ఫ్లెక్సీ, ఓ అభిమాని వినూత్న మొక్కులు.. కేసీఆర్ ఆరోగ్యం కోసం ప్రార్థనలు…

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యం బాగోలేక శుక్రవారం యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ ఆరోగ్యానికి ఏమైందంటూ పలువురు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ అభిమాని వినూత్న రీతిలో కాశీలోని విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకున్నాడు…తెలంగాణ రాష్ట్రానికి చెందిన సాయి అనే అభిమాని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో శుక్రవారం సాయంత్రం దీపారాధన కార్యక్రమం నిర్వహించి గంగా నదిలోని బోట్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేసీఆర్ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు. దేశ్‌కా నేత కేసీఆర్ అంటూ కేసీఆర్, కేటీఆర్, కవితతో పాటు ఇతర టీఆర్‌ఎస్ నేత ఫొటోలను కూడా బోట్ల మీద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వేయించాడు. కాశీ విశ్వనాథుడు సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యం కల్పించాలని ప్రార్థిస్తూ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశానని సాయి చెప్పుకొచ్చాడు..