తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం..!!!.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో ఈ భేటీ జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, జగదీష్ రెడ్డి… సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, గంగుల కమలాకర్‌, తలసాని, ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌,, ఇంద్రకరణ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌తోపాటు సీఎస్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎంపీ సంతోష్‌, ఎమ్మెల్సీ కవితలకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ భేటీలో పాల్గొనాల్సిందిగా పిలుపు వచ్చింది…పాలనాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై మంత్రులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.