తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ కీలక భేటీ….

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్‌ కీలక భేటీ..
R9TELUGUNEWS.COM.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని స్టాలిన్‌ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. కుటుంబసభ్యులతో కలిసి తమిళనాడు సీఎం నివాసానికి విచ్చేశారు కేసీఆర్‌. దేశరాజకీయాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులను సాదరంగా ఆహ్వానించారు స్టాలిన్‌. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్టాలిన్‌ కుమారుడు , డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధితో భేటీ అయ్యారు.రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తోందని ఈవిషయంపై స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చలు జరుపుతారని కూడా టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాల హక్కులను కాపాడుకునే విషయంతో తమిళనాడు సీఎంతో కలిసి పనిచేయాలన్న ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దంగా కేంద్రం వ్యహరిస్తోందని స్టాలిన్‌ కూడా తరచుగా చెబుతున్నారు.తమిళనాట డీఎంకే , అన్నాడీఎంకే పార్టీలు ద్రవిడవాదాన్ని దశాబ్దాల నుంచి బలంగా విన్పిస్తున్నాయి. ఈ రెండు పార్టీల నిర్మాణాన్ని కూడా సీఎం కేసీఆర్‌ తన పర్యటనలో పరిశీలించినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ను డీఎంకే లాగా సంస్థాగతంగా బలోపేతం చేయాలన్న ఆలోచనలో కూడా ‘సీఎం కేసీఆర్‌ ఉన్నారు.