తెలంగాణ భవన్ లో… సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 15వ తేదీ ప్రజా ప్రతినిధుల సమావేశం.

ఈనెల 15వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్ లో… టిఆర్ఎస్.. లెజిస్లేటివ్ పార్టీ (ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు) పార్లమెంటరీ పార్టీ (ఎంపీలు).,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం తో కూడిన సంయుక్త సమావేశం టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్నది…

మునుగోడు ఉపఎన్నికలో విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌పై మరింత దృష్టి పెట్టారు కేసీఆర్. ఉపఎన్నిక ఫలితాల తర్వాత బీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా తీర్చిదిద్దేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుపై బహిరంగ ప్రకటన ఇచ్చారు. ఎవరికైనా అభ్యంతరాలుంటే ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని సూచించారు.