నేడు సీఎం కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ కీలక సమావేశం..
ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఈరోజు ప్రగతిభవన్లో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం, మేనిఫెస్టోపై తుది కసరత్తు, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కేసీఆర్ వారితో సమాలోచనలు జరపనున్నారు. ఎలక్షన్స్ ఇన్ఛార్జ్ లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపైనా చర్చించనున్నారు.