బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం: కెసిఆర్…

*బిఆర్ఎస్ పార్టీ పుట్టిందే పేద ప్రజల కోసం: కెసిఆర్.

ఆదివారం కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని అయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ సోదరులకు మనవి చేస్తున్నా. మీరందరూ గత ప్రభుత్వాలను చూశారు. పదేళ్లలో ఏ ఒక్క రోజు కూడా ప్రభుత్వ ఉద్యోగులు నల్లబ్యాడ్జీల ప్రదర్శన చేయలేదు అన్నారు.

ఎంప్లాయ్‌ కి ఫ్రెండ్లీ గవర్న మెంట్‌గా ఎలా వెళ్తున్నామో తెలుసు. చిన్న ఉద్యోగులు, కాంటాక్ట్‌ ఔట్ సోర్సింగ్‌ ఉద్యోగుల కడుపులు నింపాలని.. భారత్‌లోనే తొలిసారిగా పీఆర్సీ ఇస్తే.. దాంతో సమానంగా జీతాలు పెంచింది చూశారు.

సింగరేణి ఏ విధంగా ముందుకు తీసుకొని పోతున్నమో చూస్తున్నారు . ఓటు అనేది తమాషాగా, అలవోకగా వేయకుండా.. ఈ విషయాలను ఆలోచించి..చర్చించి ఓటు వేస్తే బ్రహ్మాండంగా మళ్ళీ అభివృది జరుగుతుందన్నారు.

బీఆర్‌ఎస్‌ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. ఆ నాడు నేను బయలుదేరిన నాడు ఎవరికీ నమ్మకం లేదు. కేసీఆర్‌ బక్కగున్నడు.. ఎవరో పీక పిసికి చంపేస్తరు. అన్నారు.

ఎక్కడి తెలంగాణ ఇప్పుడు యాడ వస్తదని మాట్లాడిండ్రు. నేను ఒక్కడినే అయినా.నాతో పిడికెడు మందే ఉన్నా..పక్షి తిరిగినట్టు తెలంగాణ మొత్తం తిరిగి..సమాజాన్ని జాగృతం చేసి.. ఉప్పెలా తయారు చేస్తే అద్భుతంగా మనం రాష్ట్రం సాధించుకున్నాం.

కొత్తగూడెం పట్టణానికి కనీసం 12 సార్లు వచ్చాం. ఆ నాడు సభలు కూడా పెట్టం. నాతో కలిసి చాలా మంది మిత్రులు పని చేసినవారున్నారు. ఆ ఉప్పెనను చూసి దేశ రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాల్సిందే..ఇది న్యాయమైన విషయమని 34 పార్టీలు మద్దతు తెలిపితే రాష్ట్రం తెచ్చుకోగలిగినాం.

తెచ్చిన తెలంగాణను కొత్త సంసారాన్ని ఎలా వెళ్ల దీస్తామో అలా.. నడుపుతున్నాం’ అన్నారు.

ఉద్యోగులకు సంక్షేమం..
చేస్తున్నాం. చిన్న ఉద్యోగులను ఆదుకుంటున్నాం. కాంటాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని.. అన్నివర్గాల ప్రజలు ఏకతాటిపై ముందుకు సాగుతున్నామని అన్నారు.

సీతారామ ప్రాజెక్టు పూర్తయితే..పాత ఖమ్మం జిల్లా బంగారు తునకలా తయారైతది. కరువు అనేది మనకు రానే రాదు. కొత్తగూడెం జిల్లా గిరిజనులు ఉండే జిల్లా. ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది.

వనమా వెంకటేశ్వర్‌రావు పెద్ద మనిషి. గ్రామ పంచాయతీ వార్డ్‌ మెంబర్‌ నుంచి మంత్రి వరకు రాజకీయాల్లో ఎదిగారు. కోరి కోరి ఆయనను తెచ్చుకున్నాం. వనమా వెంకటేశ్వర్‌రావుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కెసిఆర్ కోరారు….