రేపు మునుగోడులో సీఎం కేసీఆర్ సభ. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై బహిరంగ సభలో విరుచుకు పడతారా!!..

బీజేపీ పెద్దలు, కొందరు కేంద్ర మంత్రులే లక్ష్యంగా రేపటి సభలో విరుచుకుపడతారని తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌ ఘటనలో అందరికీ తెలియని కొన్ని నిజాలను, కోణాలను సీఎం కేసీఆర్ బయటపెడతారనే ప్రచారం జరుగుతోంది.
బీజేపీ లక్ష్యంగా జాతీయ పార్టీ పెట్టిన సీఎం కేసీఆర్.. ఫామ్‌హౌస్‌ డీల్‌ను నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లి జాతీయ స్థాయిలో బీజేపీని ఇరుకునపెట్టాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఫామ్‌హౌస్‌ డీల్‌పై మూడు రోజులుగా మౌనంగా ఉంటున్నారు సీఎం కేసీఆర్. కాకపోతే, ఈ ఘటనపై వరుస సమీక్షలు చేస్తున్నారు. నలుగురు ఎమ్మెల్యేలను పిలిపించుకుని మాట్లాడారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావుతోనూ ఈ డీల్‌పై చర్చించారు. మరోవైపు పోలీసులు కూడా సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రెండు ఆడియోలు విడుదలయ్యాయి…

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బహిరంగ సభలో బిజెపిపై విరుచుకుపడతారనే ఆలోచనలో రాజకీయ వర్గాలు ఉన్నారు… సీఎం కేసీఆర్ ఫినిషింగ్ టచ్ సభతో కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేయటం జరుగుతుంది..

సీఎం కేసీఆర్‌ సభకు సర్వం సిద్దం. మంత్రి జగదీష్ రెడ్డి.

బీజేపీ పాల్పడిన ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర
నేపథ్యంలో సభపై సర్వత్రా ఆసక్తి

మధ్యాహ్నం 3గంటలకు సభ ప్రారంభం

ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి, ఎమ్మెల్యే లు గాధరి కిషోర్ కుమార్, బాల్క సుమన్, టిఎస్ఐఐసి చైర్మన్ భాలమల్లు,
*మునుగోడు*
ఉప ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్న తరుణం లో మునుగోడు నియోజకవర్గ రాజకీయం మరింత హీటేక్కుతుంది. ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండటం తో టీఆర్‌ఎస్‌ మరింత దూకుడును కొనసాగిస్తున్నది. అందులో భాగంగా సీఎం కేసీఆర్‌ సభకు సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం 3గంటలకు చండూరు మండలం బంగారిగడ్డలో సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. సభకు పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అందుకనుగుణంగా ఏర్పాట్లపై దృష్టి సారించారు. సభ ఏర్పాట్లను ఈ రోజు సాయంత్రం మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు పరిశీలించారు.
ఈ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్‌ నేరుగా చండూరుకు చేరుకోనున్నారు. కేసీఆర్‌ రాక కోసం సభా ప్రాంగణం సమీపంలోనే ముందస్తుగా హెలిప్యాడ్‌ను సైతం సిద్ధం చేశారు. బంగారిగడ్డ నుంచి చండూరు వచ్చే దారిలో రోడ్డుకు కుడి వైపున ఉన్న విశాల స్థలంలో సభ కోసం చేస్తున్న ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.
గ్యాలరీల వారీగా బారికేడ్లను సైతం సిద్ధం చేశారు. ఇక సభాస్థలికి నలువైపుల నుంచి ప్రజలు తరలిరానున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందుకు అవసరమైన స్థలాలను గుర్తించారు. సభా స్థలానికి కొద్ది దూరంలోని పార్కింగ్‌ ఏరియాల్లోనే వాహనాలను నిలిపి ప్రజలు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ మేరకు సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే నెల రోజులకు పైగా సాగుతున్న ప్రచారంలో టీఆర్‌ఎస్‌కు విశేషమైన స్పందన చూస్తే ,గ్రామగ్రామాన సబ్బండ వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్న విషయం అర్దం అవుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.. ఈ నేపధ్యంలో నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌ సభకు కూడా వేలాది మంది ప్రజలు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు స్పష్టం చేస్తున్నయన్నారు.సీఎం కేసీఆర్‌ పాల్గొననున్న సభపై మునుగోడు నియోజవర్గంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగానూ సర్వత్రా ఆసక్తి నెలకొంధి అని అన్నారు.ఓ వైపు మునుగోడు అభివృద్ధిపై కేసీఆర్‌ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారన్న దానితోపాటు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే సంచలనంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై బీజేపీని ఎలా ఏకిపారేస్తారన్న దానిపైనా అందరి దృష్టి కేంద్రీకృతమైందన్నారు.. ఇప్పటికే బీజేపీ విధానాలపై పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రకటించిన కేసీఆర్‌, ఈ సభ ద్వారా ఏమి చెప్పబోతున్నాడన్న చర్చ కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. రేపు కేసీఆర్
ఎమ్మెల్యే ల కొనుగోలు విషయం పై స్పందించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. మోదీ సర్కారుపై కేసీఆర్‌ విధానపరమైన పోరాటాన్ని ఎదుర్కోలేక బీజేపీ రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ సర్కారును అస్థిర పర్చాలని బీజేపీ చేస్తున్న కుట్రలు ఇప్పటికే బట్టబయలయ్యాయన్నారు. బీజేపీ కూల్చుడు కుట్రల రాజకీయాలపై ప్రజలు భగ్గుమంటున్నారని తెలిపారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న అభివృద్ధి, సంక్షేమ సర్కారును కూల్చివేసేందుకు చేస్తున్న బహిర్గతమైన కుట్రల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సభ జరుగుతుందన్నారు.. ఈ నేపథ్యంలో బంగారిగడ్డ సభ వేదికగా కేసీఆర్‌ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తారోనన్న సర్వత్రాఉత్కంఠ నెలకొనడం సహజం అన్నారు. ఈ సభకు అంత్యంత ప్రాధాన్యం ఉంటుందన్న మంత్రి ఇప్పటికే మునుగోడులో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఈ మేరకు వాళ్లు ఎప్పుడో కారు గుర్తు కు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి తెలిపారు.