BRS కు గట్టి పునాది మునుగోడు నుంచే ప్రారంభం కావాలి… సీఎం కేసీఆర్..

ఢిల్లీ బ్రోకర్ లు తెలంగాణ కు వచ్చి 4 గురు MLA లను ప్రలోభ పెట్టారు...

ముఖ్యమంత్రి కేసీఆర్
సభ.
చండూర్..
BRS కు గట్టి పునాది మునుగోడు నుంచే ప్రారంభం కావాలి..

సీఎం కేసీఆర్. మాట్లాడుతు..
………………………
ఇవాళ నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌ నుంచి మునుగోడు వచ్చారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని.. మీకు వంద కోట్ల రూపాయలు ఇస్తాం.. మీరు పార్టీ విడిచిపెట్టి రమ్మని చెప్పి.. వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టి అమ్ముడుపోవుడు కాదురా.. మేం అంగట్లో సరుకు కాదు.. తెలంగాణ బిడ్డలమని.. తెలంగాణ ఆత్మగౌర బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు ఎత్తారు…

మునుగోడు లో అవసరం లేకుండా వచ్చాయి ఈ ఉప ఎన్నికలు….
మునుగోడు లో TRS విజయం ఎప్పుడో ఖాయం అయింది…….
న్యాయం ఏంటో, ధర్మం ఎంటో అందరికి తెలుసు…..
ఎన్నికలు వచ్చాయి అంటే కొత్త కొత్త వాళ్ళ డ్రామాలు స్టార్ట్ అవుతాయి…
ప్రజలు మాత్రం గొప్పగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి…
ఓటు అనే ఆయుధాన్ని సమర్థవంతంగా ఉపయోగించాలి….
ఓటు అనే ఆయుధాన్ని ఆలోచించి వాడితే అభివృద్ధి జరుగుతుంది….
దేశంలో ఉన్నది ప్రజాస్వామ్యం…..
ఓటర్లు గాయి గాయి కావొద్దు…
ఓటేసేటప్పుడు జాగ్రత్తగా వేయాలి…
కరిచే పామును ఎవరైనా మెడలో వేసుకుంటారా చెప్పండి….
దేశంలో చైతన్యం రావాలి…..
మోసాలకు, ప్రలోభాలకు లొంగO అని ప్రజలు చైతన్యO చూపెట్టాలి…..
ఢిల్లీ బ్రోకర్ లు తెలంగాణ కు వచ్చి 4 గురు MLA లను ప్రలోభ పెట్టారు…ఆ MLA లు నిఖార్సయిన తెలంగాణ బిడ్డలు..
కోట్ల రూపాయల ఆఫర్ ను కాలి చెప్పుతో సమానం అంటూ నిఖార్సయిన బిడ్డల్లా నిలబడ్డారు…న్యాయం వైపు నిలబడ్డారు..
ఇది చైతన్యం అంటే…
ఇలాటి బిడ్డలు కావాలి రాజకీయాల్లో….
వందల కోట్లను కూడా గడ్డి పోచతో సమానం అంటూ ఈ MLA లు అందరికి ఆదర్శంగా నిలిచారు..
మోడీ నీకు ఇంకా ఎం కావాలి నీకు…. ఇంకా ఎందుకు ఈ దుర్మార్గం,, ఇంకా ఎందుకు ఈ అరాచకం… నిను అడుగుతున్న మోడీ ని దుర్మార్గపు ఆలోచనలు దేనికి…
వందల కోట్ల దనం నీకు ఎక్కడిది..దోచుకున్న సొమ్ముతో అరాచకాలు సృష్టిస్తున్నావ్ మోడీ…ప్రజాస్వామ్య ప్రభుత్వం లను కులదోస్తున్నావ్….
దేనికి ఈ దుర్మార్గపు ఆలోచనలు…
ఇంత అరాచకం జరుగుతుంటే ప్రజలు మౌనంగా వుండొద్దు…
ప్రజలు, బుద్ది జీవులు, చదువు కున్న వారు యువకులు అందరూ లోతుగా ఆలోచన చెయ్యాలి…
అభివృద్ధి చేసే వారికి ఓటయ్యాలి….
చేనేత కార్మికులు బీజేపీ కి గట్టి బుద్ది చెప్పాలి…5 %GST వేసి మోడీ చేనేతల కడుపు కొట్టారు….
మోడీ కి గట్టి బుద్ది చెప్పాలి…
చేనేత GSTని రద్దు చేసేంత వరకు అలుపెరగని పోరాటం చేద్దాం…..
దేశంలో 24 గంటల కరంట్ ను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ….
కేంద్రం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను ఎండగట్టాలి…
డిస్కం లను కూడా pvt చేస్తారు అంట బీజేపీ వాళ్ళు……మనం ఎట్టి పరిస్థితి ల్లో ఒప్పుకునేది లేదు…
బావుల మోటర్లకు మిటార్లు పెడతారు బీజేపీ వాళ్ళు. ..అన్నదాతలు జాగ్రత్తగా ఉండాలి….. ..బీజేపీ వాళ్ళు ఇండ్ల లో వుండే మిటార్లను కూడా 35 వేలు పెట్టి కొనాలి అంటున్నారు….. ఇంత దుర్మార్గమా……
కేసీఆర్ గట్టిగ మాట్లాడుతున్నడు అని బీజేపీ భయపడి,.తెలంగాణ MLA లను కొని కేసీఆర్ ని ఇబ్బందులు పెట్టాలని కేంద్రం కుట్ర లు చేస్తున్నది…కార్పొరేట్ గద్దలకు వ్యవసాయాన్ని అప్పజెప్పాలని బీజేపీ పెద్ద కుట్ర చేస్తున్నది…
ఇది గమనించాలి…
సందర్భం వచ్చింది ,బీజేపీ కి బుద్ది చెప్పాలి…..
నల్గొండ ఫ్లోరైడ్ సమస్యకు ఎవ్వరు పరిష్కారం చూపెట్టలేదు….
ఆనాడు నిను ఫ్లోరైడ్ ప్రాంతాల్లో తిరిగినా… కన్నీళ్లు పెట్టుకున్న… స్వయం గా, ఫ్లోరైడ్ పై పాట రాసి చైతన్యం తెచ్చిన….
భగీరథతో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేసినం..
అందుకే ఆలోచన చేసి, ఓటయ్యాలి….
దేశాన్ని మార్చేందుకు BRS పార్టీ పుట్టుకొచ్చింది..
మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మంచి అవకాశం వచ్చింది…
BRS కు పునాది రాయి మునుగోడు నుంచే మొదలవ్వాలి.
కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి..
BRS కు గట్టి పునాది మునుగోడు నుంచే ప్రారంభం కావాలి….
మునుగోడు ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా….అన్ని విధాలా అభివృద్ధి చేస్తా….
విభజన హామీలు ఏమయ్యాయి మోడీ…
మునుగోడు లో ప్రాజెక్టు లను పుర్తి చేసి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం…..
ప్రభాకర్ రెడ్డి గెలుపుతో మునుగోడు అభివృద్ధి మలుపు తిరుగుతోంది….
ఆసుపత్రి లను ఏర్పాటు చేస్తాం.., రోడ్లు అభివృద్ధి అవుతాయి…..
కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఓడినా మీ మధ్యనే వున్నాడు…
మి కుటుంభ సభ్యుడిలా కలిసి పోయాడు…మళ్ళీ కుసుకుంట్ల ను గెలిపించండి…. మునుగోడు అభివృద్ధి నిను చూసుకుంటా…విద్వేష గురువు చేతిలో దేశo అభాసుపాలైంది…
గ్యాస్ , పెట్రోల్ ధరలను పెంచి కేంద్రం సామాన్యుల జీవితాలను ఛిద్రం చేసింది…
ప్రజాస్వామ్య ప్రభుత్వం లను కులదోస్తున్న మోడీకి గుణపాఠం చెప్పాలి…
అందుకే గట్టి బుద్ది చెప్పాలి…
కేంద్ర ప్రభుత్వం సంస్థ లను pvt పరం చేస్తున్న కేంద్రంన్నీ బండ కేసి కొట్టాలి…….
ఓటుతో సరైన బుద్ది చెప్పాలి……..
కత్తి ఒకని చేతిలో పెట్టి ,,యుద్ధం ఒకలను చేయమంటే ఎట్లా….
ప్రజా కంఠక బీజేపీ ని నరికి పాతరేయాలి..
రైతు భీమా ,రైతు బంధు పథకాలు వ్యవసాయాన్ని పండుగలా చేసింది…
ఉచితాలు అపాలంటూ బీజేపీ కొత్త రాగం అందుకుంది..
14 లక్షల కోట్లు కార్పొరేట్ గద్దలకు మోడీ మాఫీ చేసారు…
మరి మిము రైతులకు ఇచ్చే రైతు భందు ఎందుకు ఇవ్వొద్దో చెప్పాలి…
MLA ల ప్రలోభాల వ్యవహారం లో అడ్డంగా దొరికిన దొంగలు జైల్లో వున్నారు… ఒక బుద్ది లేని వ్యక్తి తడి బట్టలతో ప్రమాణం అంటుండు.. ఇంత కన్నా దుర్మార్గం వుంటాదా…
ఇటు వంటి వాళ్ళను తన్ని తరిమేయాలి..
మతోన్మాద పార్టీలను తరిమి కొట్టాలి…….
బలవంతంగా రుద్దిన మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ని చెప్పుతో కొట్టేలా తీర్పు ఇవ్వాలి…
గత 20 ఏళ్లలో మంత్రి జగదీష్ రెడ్డి లేకుండా ఏ సభలో మాట్లాడలేదు..
ఎం తప్పు చేసిండు జగదీష్ రెడ్డి.. ఎందుకు ప్రచారంలో లేకుండా చేశారో అర్థం కావడం లేదు.. చాలా బాధ ఉంది..ప్రజాస్వామ్య యుతంగా మంత్రి జగదీష్ రెడ్డి ప్రచారం చేసారు…పార్టీ కోసం పని చేసారు..మరి ఆయనపై ఎన్నికల సంఘం చర్యలెందుకు తీసుకుంది…..
సమాధానం ఒక్కటే ,,మునుగోడు లో బీజేపీ కి గట్టి షాక్ ఇచ్చి తీర్పు ఇవాలి…..బీజేపీ కి డిపాజిట్లు దక్కోద్దు……కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న…..